విశాఖ శ్రీ శారదాపీఠం ఆవిర్భావం తర్వాత మహాస్వామి స్వరూపానందేంద్రులు ఏనాడూ తీరిగ్గా కూర్చోలేదు. ధర్మపోరాటాలకు, జనావళి సమస్యలకు అనుగుణంగా పీఠం కార్యాచరణను అమలు పరుస్తూనే ఉన్నారు. మహాస్వామి చేపట్టిన పంచారామాల జైత్రయాత్ర విశాఖ శ్రీ శారదాపీఠానికి విశేష ప్రాచుర్యం పొంది పీఠం చరిత్రలో ముఖ్య భూమికను పోషించింది. శ్రీ చరణులకు పాదయాత్రలు చేపట్టడం పిన్న వయసులోనే అలవడిన గొప్ప సాధనం. ఆధ్యాత్నిక చింతనతో వేదాంత విజ్ఞానాన్ని పొందేందుకు ఆయన చిరుప్రాయంలోనే వాల్తేరు నుంచి భీమిలిలో యోగాశ్రమానికి నిత్యం 44 కిలోమీటర్ల మేర నడక సాగించేవారు. యుక్త వయసులోనూ కంఠకీకారణ్యాలను సైతం లెక్క చేయకుండా ఋషికేష్ నుంచి గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాధ్, బదరీనాధ్ తదితర ప్రాంతాలను నడక మార్గంలో దర్శించిన అనుభవం ఆయనకుంది. చార్ ధామ్ ను నడకమార్గంలో ఓ మారు, అరణ్య మార్గంలో మరోమారు సందర్శించారాయన. పీఠాన్ని స్థాపించి చిదానంద భారతి స్వామి వారి ద్వారా పీఠాధిపతిగా పట్టాభిషిక్తులైన తర్వాత ఎన్నో యాత్రలు చేసి హిందూ బంధువులకు చేరువయ్యారు. ఈ క్రమంలోనే పంచారామాల జైత్రయాత్ర విజయవంతంగా సాగి తెలుగునాట ఖ్యాతి గడించారు

పంచారామాల జైత్రయాత్ర

అది 2001వ సంవత్సరం. భారతావనిలో వర్షాభావం కారణంగా అనావృష్టి తాండవించిన రోజులవి. కరువు కోరల్లో చిక్కుకుని రైతులు విలవిల్లాడుతుండటం చూసి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు చలించిపోయారు. ఈ గండం నుంచి గట్టెక్కడమెలాగో తెలియక దేవాదాయ శాఖ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్న సమయంలో శ్రీ చరణులు ముందుకొచ్చారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి వైదికంగా ఉన్న అనేక మార్గాలను అన్వేషిస్తూ పంచారామాల జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. కాలినడకన దాదాపు 650 కిలోమీటర్ల మేర నడిచి పంచారామాలను సందర్శించారు. ఆధ్యాత్మిక శోభతో ఈ యాత్ర దిగ్విజయమైంది. ఆలయాల్లో సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించారు. క్రమం తప్పకుండా నిత్యం శ్రీ శారద చంద్రమౌళీశ్వరులకు అత్యంత భక్తిశ్రద్ధలతో పీఠార్చన చేసేవారు. ఎన్నో ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యలు ఎదురైనా సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ముందుకు సాగారు. సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు పంచారామ క్షేత్రాలకు వేగంగా సాగిన యాత్ర భీమవరం చేరేసరికి నెమ్మదించింది. యాత్ర మొత్తం పాదుకలతోనే సాగించాలని శ్రీ చరుణులు సంకల్పించడం తదనుగుణంగా నడక సాగించడంతో కాళ్లకు వాపులు వచ్చాయి. అరికాళ్ల నుంచి రక్తం ద్రవించడం మొదలుపెట్టింది. చెక్క పాదుకలతో నడక సరికాదని వైద్యులు సూచించినా మహాస్వామి తన లక్ష్యసాధన వైపే ముందుకు సాగారు. చివరికి భీమవరం సమీప శివదేవుని చిక్కాల ప్రాంతానికి చేరేసరికి పరిస్థితి విషమించింది. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఐదురోజుల పాటు విశ్రాంతి తప్పలేదు. వైద్యులు వారించినా వినకుండా ఆరో రోజున భీమవరంలోని సోమేశ్వర ఆలయానికి స్వామీజీ బయలుదేరారు. అప్పటికే 450 కిలోమీటర్లకు పైబడి యాత్ర సాగినా ఎక్కడా చినుకు రాలకపోగా ప్రచండ భానుడి ప్రతాపంతో అధిక ఉష్టోగ్రతలు నమోదైన పరిస్థితి. మరోపక్క మహాస్వామి వారిని అనుసరిస్తున్న శిష్య గణంలోనూ అనారోగ్య సమస్యలే. అయినా స్వరూపానందేంద్రుల వారి సంకల్పబలం చూసి వరుణ దేవుడు కరుణించక తప్పలేదు. భీమవరంలోని సోమేశ్వర ఆలయంలో ఘటాభిషేకం పూర్తి చేసుకుని స్వామీజీ ఆలయ ధ్వజస్తంభం వద్దకు చేరేసరికి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. కుండపోత వాన కుంభవృష్టినే తలపించింది. విశేషమేమంటే ఆ వర్షం ఆ ప్రాంతానికే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం ముంచెత్తింది. ఒక్కరోజులో 89 సెంటిమీటర్ల వర్షవాతం నమోదైంది. స్వామీజీ శిష్యబృందంలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. ఆంధ్రుల ఆనందానికి అవధుల్లేవు. సర్వత్రా ఇదే చర్చ. స్వామివారి ప్రార్ధనలకు పరమశివుడే తన జటాజూటం నుంచి గంగమ్మను కైలాసం నుంచి పంపాడా అన్నట్లు కురియడంతో రైతాంగం పరవశించిపోయింది. ఆతర్వాత కొన్ని రోజులకు ఈయాత్ర గుంటూరు జిల్లా అమరావతిలో అమరారామేశ్వరుని సన్నిధిలో దిగ్విజయంగా పూర్తయింది.

TTD వివాదాల్లో స్వామీజీ చొరవ

తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన నిర్ణయాలు వివాదాస్పదమైనపుడల్లా మహాస్వామి చొరవతోనే అవి పరిష్కారానికి నోచుకునేవి. ముఖ్యంగా 2004 సంవత్సరానికి ముందు వైదిక పరమైన పలు వివాదాలు, అపరిష్కృతంగా ఉండి చర్చలకు దారి తీసేవి. వాటి పరిష్కారానికి దేశంలో ఎంతోమంది ఉద్ధండ పండితులు చొరవ తీసుకున్నా కొలిక్కి రాలేదు. ఆ సమయంలో మహాస్వామి నడుం బిగించారు. 2004 మార్చి నెలలో తిరుమల వేదికగానే ఆళ్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్టుతో కలిసి వైఖానస ఆగమ సదస్సు నిర్వహించారు. దీనికి దేశ నలుమూలల నుంచి పీఠాధిపతులు,మఠాధిపతులు, శాస్త్ర పండితులు విచ్చేసారు. శ్రీవారి ఆలయంలో ప్రాచీన వైెఖాసన ఆగమ పద్ధతిని ఆనుసరించడం ఎంత ముఖ్యమో మహాస్వామి వివరించారు. ధర్మస్థాపనలో చురుకుదనం చూపి అందరినీ ఔరా అనిపించారు. మహాస్వామి తన ప్రసంగం ద్వారా అందరి అనుమానాలను పటాపంచలు చేయడంతో మాఢ వీధులు, వేయికాళ్ళ మండపం, శ్రీవారి పుష్కరిణి, ప్రాకార నిర్మాణం తదితర వివాదాలు సద్దుమణిగాయి. ఉద్ధండ పండితులు సైతం విరుద్ధ భావాలను విడిచిపెట్టి మహాస్వామి సూచించిన పద్ధతులనే శ్రీవారి ఆలయంలో పాటించాలని తీర్మానించారు.

చతురాగమ సదస్సు

ఆలయాల నిర్వహణ, అర్చక, పురోహిత, బాహ్మణ సమస్యలపై అనుసరించాల్సిన విధి విధానాలపై 2004 సంవత్సరానికి ముందు దేవాదాయ శాఖకు సరైన మార్గదర్శకాలు లేవు. ఈ సమయంలో మహాస్వామి చొరవ తీసుకుని విశాఖ వేదికగా చతురాగమ సదస్సును నిర్వహించారు. ఆగమ శాస్త్రానుసారమే ఆలయాల్లో కైంకర్యాలు చేపట్టాలన్న నిర్ణయానికి చతురాగమ సదస్సు దోహదపడింది. అర్చక సంఘాలు లేవనెత్తిన అనేక సమస్యలకు సైతం ఆ సదస్సు వేదికగా పరిష్కారాలు లభించాయి.

ఆధ్యాత్మిక పీఠాలకు అండగా

హిదూ ధర్మానికి విఘాతమేర్పడిన ప్రతిసారి గళమెత్తే మొట్టమొదటి గొంతుక విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రుల వారిదే. 2006లో ఆధ్యాత్మిక పీఠాలపై ప్రభుత్వాలు పెత్తనం చేసేందుకు ప్రయత్నించాయి. హాథీరాంజీ మఠం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆజమాయిషీ చేపట్టేందుకు ఆలోచన చేసింది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో మహాస్వామి సఫలీకృతులయ్యారు. పాలకుల నిర్ణయాన్ని ఎండగడుతూ నిరసనకు దిగడంతో ప్రభుత్వమే తన ఆలోచనను విరమించుకుంది. సర్వసంగ పరిత్యాగులు నడిపే ఆధ్యాత్మిక పీఠాలపై పాలకుల పెత్తనమేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక వెనుకడుగు వేసింది ప్రభుత్వం. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్టు వ్యవహారాన్ని నిరసిస్తూ వినిపించిన తొలి గొంతుక కూడా స్వరూపానందేంద్రుల వారిదే. మహాస్వామి ధర్మాగ్రహంతో చేపట్టే పోరాటాలు సూటిగా, వేదోక్తంగా ఉంటాయన్న విశ్వాసం భక్తుల్లో నాటుకుపోయిందంటే ఇలాంటి ధర్మ పోరాటాలే కారణం.

ఆలయాల చుట్టూ అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట

2008 సంవత్సరానికి ముందు హిందూ దేవాలయాల చుట్టూ అన్యమత ప్రచారం జోరుగా సాగుతుండేది. ఇతర మతాల వారు ఆలయాల వెలుపల తిరుగుతూ బహిరంగంగా మత మార్పిడులకు పాల్పడేవారు. ఇది శృతిమించితే భారతావనిలో హిందూ మతం ఉనికికే పెనుముప్పుగా పరిణమిస్తుందని గ్రహించారు మహాస్వామి. ధర్మాగ్రహంతో పోరాటానికి దిగారు. ఆందోశన వ్యక్తం చేసినా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతుండటంతో ప్రత్యక్షంగా బరిలోకి దిగి సింహాచలం వరాహ లక్ష్మీ నర్మింహస్వామి ఆలయం వద్ద తన శిష్యగణంతో కలిసి ధర్నా చేసారు. దీంతో దిగొచ్చిన అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆలయాల చుట్టూ అన్యమత ప్రచారం చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ జీఓను విడుదల చేసింది.

పంచరామల జైత్రయాత్ర

పంచారామాల జైత్రయాత్ర

అది 2001వ సంవత్సరం. భారతావనిలో వర్షాభావం కారణంగా అనావృష్టి తాండవించిన రోజులవి. కరువు కోరల్లో చిక్కుకుని రైతులు విలవిల్లాడుతుండటం చూసి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు చలించిపోయారు. ఈ గండం నుంచి గట్టెక్కడమెలాగో తెలియక దేవాదాయ శాఖ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్న సమయంలో శ్రీ చరణులు ముందుకొచ్చారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి వైదికంగా ఉన్న అనేక మార్గాలను అన్వేషిస్తూ పంచారామాల జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. కాలినడకన దాదాపు 650 కిలోమీటర్ల మేర నడిచి పంచారామాలను సందర్శించారు. ఆధ్యాత్మిక శోభతో ఈ యాత్ర దిగ్విజయమైంది. ఆలయాల్లో సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించారు. క్రమం తప్పకుండా నిత్యం శ్రీ శారద చంద్రమౌళీశ్వరులకు అత్యంత భక్తిశ్రద్ధలతో పీఠార్చన చేసేవారు. ఎన్నో ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యలు ఎదురైనా సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ముందుకు సాగారు. సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు పంచారామ క్షేత్రాలకు వేగంగా సాగిన యాత్ర భీమవరం చేరేసరికి నెమ్మదించింది. యాత్ర మొత్తం పాదుకలతోనే సాగించాలని శ్రీ చరుణులు సంకల్పించడం తదనుగుణంగా నడక సాగించడంతో కాళ్లకు వాపులు వచ్చాయి. అరికాళ్ల నుంచి రక్తం ద్రవించడం మొదలుపెట్టింది. చెక్క పాదుకలతో నడక సరికాదని వైద్యులు సూచించినా మహాస్వామి తన లక్ష్యసాధన వైపే ముందుకు సాగారు. చివరికి భీమవరం సమీప శివదేవుని చిక్కాల ప్రాంతానికి చేరేసరికి పరిస్థితి విషమించింది. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఐదురోజుల పాటు విశ్రాంతి తప్పలేదు. వైద్యులు వారించినా వినకుండా ఆరో రోజున భీమవరంలోని సోమేశ్వర ఆలయానికి స్వామీజీ బయలుదేరారు. అప్పటికే 450 కిలోమీటర్లకు పైబడి యాత్ర సాగినా ఎక్కడా చినుకు రాలకపోగా ప్రచండ భానుడి ప్రతాపంతో అధిక ఉష్టోగ్రతలు నమోదైన పరిస్థితి. మరోపక్క మహాస్వామి వారిని అనుసరిస్తున్న శిష్య గణంలోనూ అనారోగ్య సమస్యలే. అయినా స్వరూపానందేంద్రుల వారి సంకల్పబలం చూసి వరుణ దేవుడు కరుణించక తప్పలేదు. భీమవరంలోని సోమేశ్వర ఆలయంలో ఘటాభిషేకం పూర్తి చేసుకుని స్వామీజీ ఆలయ ధ్వజస్తంభం వద్దకు చేరేసరికి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. కుండపోత వాన కుంభవృష్టినే తలపించింది. విశేషమేమంటే ఆ వర్షం ఆ ప్రాంతానికే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం ముంచెత్తింది. ఒక్కరోజులో 89 సెంటిమీటర్ల వర్షవాతం నమోదైంది. స్వామీజీ శిష్యబృందంలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. ఆంధ్రుల ఆనందానికి అవధుల్లేవు. సర్వత్రా ఇదే చర్చ. స్వామివారి ప్రార్ధనలకు పరమశివుడే తన జటాజూటం నుంచి గంగమ్మను కైలాసం నుంచి పంపాడా అన్నట్లు కురియడంతో రైతాంగం పరవశించిపోయింది. ఆతర్వాత కొన్ని రోజులకు ఈయాత్ర గుంటూరు జిల్లా అమరావతిలో అమరారామేశ్వరుని సన్నిధిలో దిగ్విజయంగా పూర్తయింది.

TTD వివాదాల్లో స్వామీజీ చొరవ

TTD వివాదాల్లో స్వామీజీ చొరవ

తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన నిర్ణయాలు వివాదాస్పదమైనపుడల్లా మహాస్వామి చొరవతోనే అవి పరిష్కారానికి నోచుకునేవి. ముఖ్యంగా 2004 సంవత్సరానికి ముందు వైదిక పరమైన పలు వివాదాలు, అపరిష్కృతంగా ఉండి చర్చలకు దారి తీసేవి. వాటి పరిష్కారానికి దేశంలో ఎంతోమంది ఉద్ధండ పండితులు చొరవ తీసుకున్నా కొలిక్కి రాలేదు. ఆ సమయంలో మహాస్వామి నడుం బిగించారు. 2004 మార్చి నెలలో తిరుమల వేదికగానే ఆళ్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్టుతో కలిసి వైఖానస ఆగమ సదస్సు నిర్వహించారు. దీనికి దేశ నలుమూలల నుంచి పీఠాధిపతులు,మఠాధిపతులు, శాస్త్ర పండితులు విచ్చేసారు. శ్రీవారి ఆలయంలో ప్రాచీన వైెఖాసన ఆగమ పద్ధతిని ఆనుసరించడం ఎంత ముఖ్యమో మహాస్వామి వివరించారు. ధర్మస్థాపనలో చురుకుదనం చూపి అందరినీ ఔరా అనిపించారు. మహాస్వామి తన ప్రసంగం ద్వారా అందరి అనుమానాలను పటాపంచలు చేయడంతో మాఢ వీధులు, వేయికాళ్ళ మండపం, శ్రీవారి పుష్కరిణి, ప్రాకార నిర్మాణం తదితర వివాదాలు సద్దుమణిగాయి. ఉద్ధండ పండితులు సైతం విరుద్ధ భావాలను విడిచిపెట్టి మహాస్వామి సూచించిన పద్ధతులనే శ్రీవారి ఆలయంలో పాటించాలని తీర్మానించారు.

చతురాగమ సదస్సు

ఆలయాల నిర్వహణ, అర్చక, పురోహిత, బాహ్మణ సమస్యలపై అనుసరించాల్సిన విధి విధానాలపై 2004 సంవత్సరానికి ముందు దేవాదాయ శాఖకు సరైన మార్గదర్శకాలు లేవు. ఈ సమయంలో మహాస్వామి చొరవ తీసుకుని విశాఖ వేదికగా చతురాగమ సదస్సును నిర్వహించారు. ఆగమ శాస్త్రానుసారమే ఆలయాల్లో కైంకర్యాలు చేపట్టాలన్న నిర్ణయానికి చతురాగమ సదస్సు దోహదపడింది. అర్చక సంఘాలు లేవనెత్తిన అనేక సమస్యలకు సైతం ఆ సదస్సు వేదికగా పరిష్కారాలు లభించాయి.

ఆధ్యాత్మిక పీఠాలకు అండగా

హిదూ ధర్మానికి విఘాతమేర్పడిన ప్రతిసారి గళమెత్తే మొట్టమొదటి గొంతుక విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రుల వారిదే. 2006లో ఆధ్యాత్మిక పీఠాలపై ప్రభుత్వాలు పెత్తనం చేసేందుకు ప్రయత్నించాయి. హాథీరాంజీ మఠం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆజమాయిషీ చేపట్టేందుకు ఆలోచన చేసింది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో మహాస్వామి సఫలీకృతులయ్యారు. పాలకుల నిర్ణయాన్ని ఎండగడుతూ నిరసనకు దిగడంతో ప్రభుత్వమే తన ఆలోచనను విరమించుకుంది. సర్వసంగ పరిత్యాగులు నడిపే ఆధ్యాత్మిక పీఠాలపై పాలకుల పెత్తనమేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక వెనుకడుగు వేసింది ప్రభుత్వం. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్టు వ్యవహారాన్ని నిరసిస్తూ వినిపించిన తొలి గొంతుక కూడా స్వరూపానందేంద్రుల వారిదే. మహాస్వామి ధర్మాగ్రహంతో చేపట్టే పోరాటాలు సూటిగా, వేదోక్తంగా ఉంటాయన్న విశ్వాసం భక్తుల్లో నాటుకుపోయిందంటే ఇలాంటి ధర్మ పోరాటాలే కారణం.

ఆలయాల చుట్టూ అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట

2008 సంవత్సరానికి ముందు హిందూ దేవాలయాల చుట్టూ అన్యమత ప్రచారం జోరుగా సాగుతుండేది. ఇతర మతాల వారు ఆలయాల వెలుపల తిరుగుతూ బహిరంగంగా మత మార్పిడులకు పాల్పడేవారు. ఇది శృతిమించితే భారతావనిలో హిందూ మతం ఉనికికే పెనుముప్పుగా పరిణమిస్తుందని గ్రహించారు మహాస్వామి. ధర్మాగ్రహంతో పోరాటానికి దిగారు. ఆందోశన వ్యక్తం చేసినా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతుండటంతో ప్రత్యక్షంగా బరిలోకి దిగి సింహాచలం వరాహ లక్ష్మీ నర్మింహస్వామి ఆలయం వద్ద తన శిష్యగణంతో కలిసి ధర్నా చేసారు. దీంతో దిగొచ్చిన అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆలయాల చుట్టూ అన్యమత ప్రచారం చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ జీఓను విడుదల చేసింది

విశాఖ శ్రీ శారదాపీఠం ఆవిర్భావం తర్వాత మహాస్వామి స్వరూపానందేంద్రులు ఏనాడూ తీరిగ్గా కూర్చోలేదు. ధర్మపోరాటాలకు, జనావళి సమస్యలకు అనుగుణంగా పీఠం కార్యాచరణను అమలు పరుస్తూనే ఉన్నారు. మహాస్వామి చేపట్టిన పంచారామాల జైత్రయాత్ర విశాఖ శ్రీ శారదాపీఠానికి విశేష ప్రాచుర్యం పొంది పీఠం చరిత్రలో ముఖ్య భూమికను పోషించింది. శ్రీ చరణులకు పాదయాత్రలు చేపట్టడం పిన్న వయసులోనే అలవడిన గొప్ప సాధనం. ఆధ్యాత్నిక చింతనతో వేదాంత విజ్ఞానాన్ని పొందేందుకు ఆయన చిరుప్రాయంలోనే వాల్తేరు నుంచి భీమిలిలో యోగాశ్రమానికి నిత్యం 44 కిలోమీటర్ల మేర నడక సాగించేవారు. యుక్త వయసులోనూ కంఠకీకారణ్యాలను సైతం లెక్క చేయకుండా ఋషికేష్ నుంచి గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాధ్, బదరీనాధ్ తదితర ప్రాంతాలను నడక మార్గంలో దర్శించిన అనుభవం ఆయనకుంది. చార్ ధామ్ ను నడకమార్గంలో ఓ మారు, అరణ్య మార్గంలో మరోమారు సందర్శించారాయన. పీఠాన్ని స్థాపించి చిదానంద భారతి స్వామి వారి ద్వారా పీఠాధిపతిగా పట్టాభిషిక్తులైన తర్వాత ఎన్నో యాత్రలు చేసి హిందూ బంధువులకు చేరువయ్యారు. ఈ క్రమంలోనే పంచారామాల జైత్రయాత్ర విజయవంతంగా సాగి తెలుగునాట ఖ్యాతి గడించారు

దేవాదాయ భూములు పరిరక్షణే ధ్యేయంగా

దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆస్తులు, భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి నడుం బిగించారు. ఆలయాల నిర్వహణ కోసం దాతలిచ్చిన ఆస్తులు, భూములను విక్రయించే అధికారం ప్రభుత్వాలకు లేవని బల్లగుద్ది మరీ వాదించారు. ఈ విషయంలో పాలకులను అడ్డుకోవడానికి ధర్మ పోరాటానికి శ్రీకారం చుట్టారు. చివరికి కోర్టు గుమ్మం తొక్కారు. పీఠం తరపున కోర్టులో కేసు వేసి ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని వాదిస్తూ వస్తున్నారు. గడిచిన పదేళ్లుగా దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా, ప్రభుత్వాలు వాటి జోలికి పోకుండా ఉన్నాయంటే కోర్టు పరిధిలో ఈ వ్యవహారం ఉండటమే కారణం.

స్వామీజీ చేతులమీదుగా

జ్యోతిర్లింగ క్షేత్రాల్లొ ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ శిఖరానికి బంగారు తాపడాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి తన చేతులమీదుగా తొడిగారు. అలాగే విమాన గోపురానికి కూడా స్వామీజీ చేతుల మీదుగానే బంగారు తాపడాన్ని తొడిగించి సంప్రోక్షణ చేయించారు. దీనితో పాటు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ శిఖర సంప్రోక్షణ, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ రాజగోపురం సంప్రోక్షణలు కూడా మహాస్వామి చేతులమీదుగానే సాగాయి.

దైవ సన్నిధానం

విశాఖ శ్రీ శారదాపీఠానికి ఉన్న పీఠ పాలిత ఆలయాల్లో ప్రధానమైంది హైదరాబాద్ ఫిలింనగర్ లోని దైవ సన్నిధానం. భాగ్య నగరంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేతంగా ప్రస్తుతమిది విరాజిల్లుతోంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి సూచనలతో ప్రముఖ సినీ నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్, సినీ ప్రముఖులు చిరంజీవి, మోహన్ బాబు, పరుచూరి సోదరులు తదితరులు దైవ సన్నిధానం నిర్మాణానికి కృషి చేసారు. 2004వ సంవత్సరం జూన్ 2వ తేదీన దీనికి అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం దైవ సన్నిధానంలో శంఖు చక్ర నామ సహితంగా భూదేవి సమేత వెంకటేశ్వరస్వామితో పాటు వరసిద్ధి వినాయకుడు, మల్లికార్జున స్వామి మందిరాలున్నాయి.

శంకరవాణి ఆవిర్భావం

స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ధర్మబద్ధమైన ఉపన్యాసాలను శాస్త్ర సమ్మతంగా ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో శంకరవాణి మాసపత్రికను విశాఖ శ్రీ శారదాపీఠం ప్రారంభించింది. పూర్వ కాలంలో వేదాన్ని అక్షరబద్ధం చేయాలనే సంకల్పంతో పాణిని మహర్షి శివుని ఢమరుక నాదం నుంచి వెలుగుచూసిన శబ్ధాలను ఎలా రూపకల్పన చేసారో అలా ప్రస్తుత కాలానికి అనుగుణంగా శ్రీ చరణులు శంకరవాణి మాసపత్రికను ప్రవేశపెట్టారు. నవ సమాజానికి శంకరుల యొక్క తత్వాన్ని ఆధ్యాత్మిక అంశాలను, ముఖ్యంగా పీఠం నిర్వహించే కార్యక్రమాలు, మహాస్వామి వారి సమాచారాన్ని ఈ పత్రికలో పొందుపరచి విశాఖ శ్రీ శారదాపీఠం అందరికీ చేరువ కావడానికి ఆవిష్కృతమైనదే శంకరవాణి.

దేశ నలుమూలలా స్వామీజీకి శిష్య గణం

ఓ చేతితో ధర్మ పోరాటాలు, మరో చేతితో ధర్మ ప్రబోధాలు చేపట్టె చైతన్య మూర్తి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వాములంటేె ఇష్టపడే శిష్యులు దేశ నలుమూలలా ఉన్నారు. ఇందులో టీ సుబ్బరామిరెడ్డి ముందు వరుసలో ఉంటారు. పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఉమాభారతి ఆర్ ఎస్ ఎస్, వీ హెచ్ పీ ప్రతినిధులు, సినీ ప్రముఖులు ఎందరో ఉన్నారు .

దేవాదాయ భూముల పరిరక్షణే ధ్యేయంగా

దేవాదాయ భూముల పరిరక్షణే ధ్యేయంగా

దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆస్తులు, భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి నడుం బిగించారు. ఆలయాల నిర్వహణ కోసం దాతలిచ్చిన ఆస్తులు, భూములను విక్రయించే అధికారం ప్రభుత్వాలకు లేవని బల్లగుద్ది మరీ వాదించారు. ఈ విషయంలో పాలకులను అడ్డుకోవడానికి ధర్మ పోరాటానికి శ్రీకారం చుట్టారు. చివరికి కోర్టు గుమ్మం తొక్కారు. పీఠం తరపున కోర్టులో కేసు వేసి ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని వాదిస్తూ వస్తున్నారు. గడిచిన పదేళ్లుగా దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా, ప్రభుత్వాలు వాటి జోలికి పోకుండా ఉన్నాయంటే కోర్టు పరిధిలో ఈ వ్యవహారం ఉండటమే కారణం

స్వామీజీ చేతులమీదుగా

స్వామీజీ చేతులమీదుగా

జ్యోతిర్లింగ క్షేత్రాల్లొ ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ శిఖరానికి బంగారు తాపడాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి తన చేతులమీదుగా తొడిగారు. అలాగే విమాన గోపురానికి కూడా స్వామీజీ చేతుల మీదుగానే బంగారు తాపడాన్ని తొడిగించి సంప్రోక్షణ చేయించారు. దీనితో పాటు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ శిఖర సంప్రోక్షణ, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ రాజగోపురం సంప్రోక్షణలు కూడా మహాస్వామి చేతులమీదుగానే సాగాయి.

దైవ సన్నిధానం

విశాఖ శ్రీ శారదాపీఠానికి ఉన్న పీఠ పాలిత ఆలయాల్లో ప్రధానమైంది హైదరాబాద్ ఫిలింనగర్ లోని దైవ సన్నిధానం. భాగ్య నగరంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేతంగా ప్రస్తుతమిది విరాజిల్లుతోంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి సూచనలతో ప్రముఖ సినీ నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్, సినీ ప్రముఖులు చిరంజీవి, మోహన్ బాబు, పరుచూరి సోదరులు తదితరులు దైవ సన్నిధానం నిర్మాణానికి కృషి చేసారు. 2004వ సంవత్సరం జూన్ 2వ తేదీన దీనికి అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం దైవ సన్నిధానంలో శంఖు చక్ర నామ సహితంగా భూదేవి సమేత వెంకటేశ్వరస్వామితో పాటు వరసిద్ధి వినాయకుడు, మల్లికార్జున స్వామి మందిరాలున్నాయి.

శంకరవాణి ఆవిర్భావం

స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ధర్మబద్ధమైన ఉపన్యాసాలను శాస్త్ర సమ్మతంగా ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో శంకరవాణి మాసపత్రికను విశాఖ శ్రీ శారదాపీఠం ప్రారంభించింది. పూర్వ కాలంలో వేదాన్ని అక్షరబద్ధం చేయాలనే సంకల్పంతో పాణిని మహర్షి శివుని ఢమరుక నాదం నుంచి వెలుగుచూసిన శబ్ధాలను ఎలా రూపకల్పన చేసారో అలా ప్రస్తుత కాలానికి అనుగుణంగా శ్రీ చరణులు శంకరవాణి మాసపత్రికను ప్రవేశపెట్టారు. నవ సమాజానికి శంకరుల యొక్క తత్వాన్ని ఆధ్యాత్మిక అంశాలను, ముఖ్యంగా పీఠం నిర్వహించే కార్యక్రమాలు, మహాస్వామి వారి సమాచారాన్ని ఈ పత్రికలో పొందుపరచి విశాఖ శ్రీ శారదాపీఠం అందరికీ చేరువ కావడానికి ఆవిష్కృతమైనదే శంకరవాణి.

దేశ నలుమూలలా స్వామీజీకి శిష్య గణం

ఓ చేతితో ధర్మ పోరాటాలు, మరో చేతితో ధర్మ ప్రబోధాలు చేపట్టె చైతన్య మూర్తి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వాములంటేె ఇష్టపడే శిష్యులు దేశ నలుమూలలా ఉన్నారు. ఇందులో టీ సుబ్బరామిరెడ్డి ముందు వరుసలో ఉంటారు. పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఉమాభారతి ఆర్ ఎస్ ఎస్, వీ హెచ్ పీ ప్రతినిధులు, సినీ ప్రముఖులు ఎందరో ఉన్నారు.

సంప్రదించండి

మీకు సంబంధించిన సమాచారం వేరెవరికీ చేరదు. గోప్యంగా ఉంటుంది.