పీఠం

విశాఖ శ్రీ శారదాపీఠం లక్ష్యం

హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం... సామాజిక చింతనతో సకల ప్రాణికోటిలోనూ పరమాత్ముడిని దర్శిస్తూ చరాచర సృష్టి సంక్షేమం కోసం నిత్యం పాటుపడేదే హైందవ ధర్మం. ఇది ప్రపంచానికి అత్యంత ఆవశ్యం. దీనిని విశ్వవ్యాప్తం చేయడం ద్వారా సకల మానవాళి సంక్షేమం సాధ్యమౌతుంది. హిందూ ధర్మంలో ఉండే కీలక అంశాలు మానవుడి జీవన విధానం, సమాజం పట్ల బాధ్యతాయుతమైన పాత్ర, సాటి మానవులు, సాటి ప్రాణుల పట్ల ఎలా ఉండాలి, రుజు మార్గంలో ఎలా పయనించాలో వివరిస్తూ మనిషిలో మార్పును సాధించే దిశలో ప్రయత్నించడం హైందవ ధర్మం లక్ష్యం.

శంకర అద్వైత తత్వంపై ప్రచారం - సమస్త ప్రాణికోటిలోనూ ఉండేది ఆత్మ ఒక్కటే. ఆత్మకు చావులేదు. ఇది ఒక బ్రహ్మతత్వం. ఒక జ్ఞాన జ్యోతి. ప్రతి నర్తనలోనూ ఆవరించి ఉంటుంది. ప్రపంచంలో ఉండే సమస్త జీవరాశులు సమానమేనని.. అందులో ఉండే పరమాత్మ తత్వం ఒక్కటేనని చాటి చెప్పేదే అద్వైతం. ప్రాణులన్నీ దైవ స్వరూపాలేనని, ఈ దైవ స్వరూపాల మధ్య ఎలాంటి తారతమ్యాలు లేవని వివరించి చెప్పే శంకర అద్వైతాన్ని ప్రపంచానికి చాటడం ద్వారా సమాజాన్ని శాంతి ధామంగా చూడాలన్నది విశాఖ శారదాపీఠం లక్ష్యం.

యువతకు ఆధ్యాత్మిక నిర్దేశం - మానవ జీవితంలో బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం... ఇలా పలు ఆశ్రమాలు ఉంటాయి. వీటిలో యవ్వనం శక్తివంతమైంది. భారతీయ చరిత్రను తిరగేస్తే ఇప్పటివరకు యువకులు సాధించినదే ఎక్కువ. ప్రపంచాన్ని గొప్ప మార్గంలో పయనింపజేయాలన్నా, ఈ భూగోళాన్ని శాంతికి నిలయంగా మార్చాలన్నా, భారతీయ ధర్మ మార్గంలో సకల మానవాళిని నడిపించాలన్నా యువశక్తి భాగస్వామ్యమే కీలకం. నేడు ప్రపంచాన్ని శాసించే అనేకానేక రంగాల్లో భారతీయ యువకులే నిష్ణాతులు. అలాంటి యువతను ధర్మమార్గం వైపు నడిపించడం, ధర్మం పట్ల అభిరుచిని, అనురక్తిని కలిగించడం విశాఖ శ్రీ శారదాపీఠం లక్ష్యం.

పురాణేతిహాసాలు, వేద, శాస్త్రాలపై ప్రచారం - రామాయణ, భారత, భాగవతాలు భారతావనికి మూల గ్రంధాలు. అష్టాదశ పురాణాలు భారతీయ హైందవ ధర్మానికి పునాదులు. సమస్త ప్రాణికోటిలో ప్రేమాభిమానాలు పాదుగొల్పేది వేదాలు. వీటిని ప్రస్తుత ఆధునికోత్తర కాలంలో జనావళి దగ్గరకు చేర్చడం అత్యంత ఆవశ్యం. తద్వారా నీతిపట్ల అభిమానాన్ని, క్రమశిక్షణ పట్ల ప్రేమను, ధర్మం పట్ల ధర్మావేశాన్ని కలిగించడం దోహదమవుతుంది. వీటిలో ఉండే ధర్మ సూక్ష్మాలను ప్రజా సమూహంలో ప్రచారం చేయడం ద్వారా మానవుడు నీతివంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఏర్పడతాయని విశాఖ శ్రీ శారదాపీఠం ప్రగాఢంగా విశ్వసిస్తోంది. అందుకే వీటిపై విస్తృత ప్రచారం చేస్తోంది.

గురువుల తయారీ - బుద్దిజీవుల్లో ఉండే కల్మషాన్ని, కశ్మలాన్ని, చీకటిని, ఆలోచనల్లో ఉండే అసమానతలను తొలగించి మానవుడిని ప్రేమమూర్తిగా తయారుచేసేవాడే గురువు. అలాంటి గురువులు ఈ సమాజానికి నిర్దేశకులు అవుతారు. మానవ సమూహాలను సన్మార్గంలో నడిపిస్తారు. అలాంటి గురువులు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పునశ్చరణ చేసుకుని మరింతగా సమాజానికి ఉపయోగపడేలా సంస్కార కేంద్రాలు దోహద పడతాయి. అలాంటి సద్గురువుల సంఖ్యను పెంచడమే విశాఖ శ్రీ శారదాపీఠం లక్ష్యం.

పీఠం ఆవిర్భావం

అవైదిక మతములు మనదేశంలో విశృంఖలంగా విలయ తాండవం చేస్తున్న సమయంలో సాక్షాత్తూ పరమాత్మయే ఆదిశంకరునిగా అవతరించి ఈ భువిలో అద్వైత స్థాపనకు పూనుకున్నారు. ఆసేతు హిమాచలం పర్యటించి ధర్మసంస్థాపన కోసం నాలుగు పీఠాలను స్థాపించారు. ఆపీఠాలతో పాటు శంకర అద్వైత తత్వాన్ని సారంగా తీసుకుని అనేక సనాతన వైదిక స్వతంత్ర పీఠాలు ఏర్పడ్డాయి. ఈ స్వతంత్ర పీఠాల్లో విశాఖ శ్రీ శారదాపీఠ మహాసంస్టానం అతి విలక్షణమైనది. భారతీయ ధర్మ జీవనం అతి సనాతనం. కాలం మారుతన్నా ఎల్లకాలమూ స్థిరంగా నిలిచేది మన సనాతన హైందవ ధర్మం. అటువంటి స్వధర్మానుష్టానుమే ధ్యేయంగా అద్వైత సాంప్రదాయాన్ని అహర్నిశలు ప్రచారం చేస్తూ ప్రతిఒక్కరూ ధర్మబద్ధమైన జీవితాన్ని సాగించేటట్లు చేస్తోంది విశాఖ శ్రీ శారదాపేఠం. 14 దశాబ్దాల పూర్వం పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య సంప్రదాయ శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారికి పరంపరానుగతంగా శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహం, చంద్రమౌళీశ్వరుల స్ఫటిక శివలింగం, మరకత శివలింగం, సాలిగ్రామం,లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం, శ్రీ చక్రం తదితరాలను గురువుల ఆదేశాల మేరకు అద్వైత ప్రచారం కోసం కర్నాటక రాష్ట్రం హోళే నర్సిపూర్ నుంచి విశాఖపట్నంకు తరలించారు. వాటితోనే శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి చేతుల మీదుగా విశాఖ శ్రీ శారదాపీఠం రూపుదిద్దుకుంది. పూజ్యశ్రీ మహాస్వామి వారు స్థాపించిన విశాఖ శ్రీ శారదాపిఠం దేదీప్య మానంగా వెలుగొందుతూ భక్తుల హృదయాలలో ఆధ్యాత్మిక ప్రశాంతతను నింపుతోంది. విశాఖ శ్రీ శారదాపీఠం ప్రభాత సూర్యుడిలా భాసిస్తూ ప్రతిఒక్కరినీ ధర్మ మార్గాన్ని అనుసరించే విధంగా స్ఫూర్తినిస్తోంది. ప్రతి భక్తుని హృదయంలో సిద్ధిపీఠంగా, తపోపిఠంగా, జ్ఞానపీఠంగా సుస్థిరమైన స్థానాన్ని నిలుపుకుంది.

శారదా మాత అంటే కేవలం సరస్వతీ దేవి మాత్రమే కాదు. సరస్వతి ఉంటేనే లక్ష్మికి వెలుగు. సరస్వతి అనుగ్రహంతోనే లక్ష్మిని సాధించగలరు. సకల భువనాలకు మాతృమూర్తి శారదా మాతే. శారదాంబ దయతోనే అన్నీ సాకారమౌతాయి. అందుకే స్వరూపానందేంద్రులు పీఠానికి శ్రీ శారదా పీఠంగా నామకరణం చేశారు. ప్రపంచానికి మోక్షమార్గాన్ని చూపగల ఆది శంకరుని బాట అంటే స్వరూపానందేంద్రుల వారికి పంచ ప్రాణాలు. శంకరాచార్య మార్గంలో పీఠాన్ని శరవేగంగా తీర్చిదిద్దారు. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ పీఠాన్ని నిర్వహిస్తున్నారు.

పీఠం భౌగోళిక స్వరూపం

విశాఖ శ్రీ శారదాపీఠానికి విచ్చేసినపుడు ముందుగా ఎదురయ్యేది స్వాగత ద్వారం. అది దాటుకుని వస్తే దక్షిణం వైపు పీఠం ప్రధాన ద్వారం దర్శనమిస్తుంది. ఆద్వారంపై శంకరులు స్థాపించిన షణ్మతాలు గోచరిస్తాయి. పీఠంలో అడుగుమోపిన మరుక్షణం ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఆదిగురువు శ్రీ మేధా దక్షిణామూర్తి మందిరం దర్శనమిస్తుంది. దాన్ని ఆనుకునే పీఠం ప్రధాన కార్యాలయం ఉంటుంది. తర్వాత గురుపాదుక పేరుతో ఏర్పాటైన భవనం ఉంటుంది. దాన్ని ఆనుకునే జగద్గురు నిలయం దర్శనమిస్తుంది. ఇదే పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివార్ల నిలయం. స్వామి వార్ల దర్శన భాగ్యం ఇక్కడి దర్బారు హాలులోనే ఉంటుంది. ఎదురుగా సిద్ధి గణపతి స్థూపం దర్శనమిస్తుంది. శ్రీ చరణులు ప్రాతః కాల అనుష్టానం అయిన వెనువెంటనే సిద్ధిగణపతిని దర్శిస్తారు. జగద్గురు మందిరాన్ని ఆనుకునే పీఠం అధిష్టాన దేవత అయిన శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఆలయం ఉన్నది. అమ్మవారి ఆలయానికి దక్షిణంగా విజయగణపతి, ఉత్తరం వైపు జగద్గురు ఆది శంకరాచార్యుల ఆలయాలు కొలువై ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే షోడశ భుబి రూపంలో వనదుర్గ అమ్మవారు కూడా కొలువుదీరి ఉన్నారు. ఈ ప్రాంగణాన్ని ఆనుకునే పీఠం పోటుని నిర్వహిస్తారు. పోటుకు పైభాగంలో విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల అగుపిస్తుంది. పోటు ప్రాంగణంలోనే అన్న ప్రసాద వితరణ కోసం ప్రత్యేక హాలు ఉంటుంది. ఆ తర్వాత ఉత్సవ మండపం...దానికెదురుగా వల్లి కళ్యాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపే అపూర్వ సుధా నిర్మాణం కనువిందు చేస్తుంది. దీనికి కుడివైపు శ్రీకృష్ట పరమాత్ముని ఆలయం దాన్ని ఆనుకుని నాగదేవత, ఉత్తరం వైపు దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శనమిస్తాయి. కొంచెం ముందుకు వెళితే దాసాంజనేయ స్వామి దర్శనం లభిస్తుంది. దాసాంజనేయ మండపాన్ని ఆనుకుని అత్యంత సుందరంగా సాలిగ్రామ శిలతో నిర్మితమైన స్వయంజ్యోతి మండపం ఆకర్షిస్తుంది. ఈ మండపాన్ని ఆనుకుని వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఎదురుగా చంద్రమౌళీశ్వరుల దేవాలయం, అలాగే ప్రదోష తాండవమూర్తి సుందర రూపం మరియు విజయాన్ని చేకూర్చు శమీ వృక్షం ఉంటాయి. శమీ వృక్షం నీడలో శాశ్వత నిర్మాణంతో కూడిన ఆగమ యాగశాల కనిపిస్తుంది. యాగశాలకు ఎదురుగా శారదా చంద్రమౌళీశ్వరులకు నిత్య పీఠపూజ మందిరం ఉంటుంది. ఇక్కడే శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహం స్వర్ణ మందిరంలో కొలువుదీరి ఉంటుంది. స్వామివార్లు నిత్యం ఇక్కడే అమ్మవారికి పీఠపూజ చేపడుతుంటారు. ఈ ప్రాంగణానికి ఎదురుగా సుగంధ పరిమళాలు వెదజల్లే పూలమొక్కలు, పలు దేవతా వృక్షాలతో సుందర నందనవనం కనువిందు చేస్తుంది. పీఠ పాలకుడైనటువంటి కాల భైరవుడు ఇందులోనే కొలువుదీరి ఉంటాడు. అక్కడే పీఠం యొక్క తూర్పు ద్వారం దర్శనమిస్తుంది. పీఠం వెనుక భాగంలో గోశాల కూడా నిర్వహించబడుతోంది. పీఠంలో విధులు నిర్వర్తించే అర్చక, పాచక, పరిచారకుల కోసం గృహ సముదాయం ఉంటుంది.

పీఠానికి ప్రధానమైనవి -

  • మఠ క్షేత్రం - సింహాచలం
  • పీఠ దేవత - స్కందుడు
  • పీఠ రక్షకుడు - నారసింహుడు
  • పీఠ శక్తి - శ్రీ శారదా స్వరూప రాజశ్యామల
  • పీఠ సాంప్రదాయం - సరస్వతీ
  • పీఠ తీర్ధం - జ్ఞానవాపి
  • పీఠ లక్ష్యం - శంకర అద్వైత ప్రచారం, సనాతన ధర్మ పరిరక్షణ

పీఠ ప్రాంగణంలో ఆలయాలు

రాజశ్యామల అమ్మవారి ఆలయం

విశాఖ శ్రీ శారదాపీఠంలో ఆధిష్టాన దేవతగా, పీఠ శక్తిగా విరాజిల్లుతున్న శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి వైభవం విశేష ప్రాచుర్యం పొందింది. విశాఖ శ్రీ శారదాపీఠ గురుపరంపరలో అతి సనాతనంగా అనుష్టానం చేస్తున్న అమ్మవారు రాజశ్యామల అమ్మవారు. ఎక్కడా లేని విధంగా శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి మంత్ర ప్రదానంగా అర్చనా విధులు నిర్వహించడం విశాఖ శ్రీ శారదాపీఠంలోనే కనిపిస్తుంది. వేదకాలంలో భండాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి ఆ జగన్మాతయే రాజశ్యామల అమ్మవారిగా మంత్ర తంత్ర ప్రదానంగా అవతరించారు. త్రిగుణాత్మకంగా, కాలానుగుణంగా అమ్మవారు దర్శనమిస్తుంటారు. దేవతలు నాలుగు భుజాలతో కూడి ఉన్న రాజశ్యామల అమ్మవారిని సత్వ గుణ ప్రదానంగా అర్చన చేస్తే, మానవులు 8 భుజాలతో కూడి ఉన్న రాజశ్యామల అమ్మవారిని రజో గుణ మూర్తిగా ఆరాధిస్తుంటారు. అసురులు షోడశ(16) భుజాలతో కూడిన రాజశ్యామల అమ్మవారిని తమోగుణ ప్రదానంగా అర్చిస్తూ ఉంటారు. హయగ్రీవుడు అగస్త్యునికి ధర్మ సూక్ష్మాలను ఉపదేశిస్తున్న సమయంలో రాజశ్యామల ప్రస్తావన వచ్చింది. నిత్యైవశా జగన్మూర్తి స్మృతుల్లో చెప్పబడినటువంటి అనేక సూక్ష్మాలను అగస్త్యుడు హయగ్రీవుల ద్వారా తెలుసుకున్నారు. ఎంతోమంది బుషులు, మునులు అనేక ఉపాసనా గ్రంధాలలో రాజశ్యామల యొక్క అనుష్టానాన్ని, తత్వాన్ని విశేషంగా ప్రస్తావించారు. శారదా తిలకం, ప్రపంచ సార తంత్రం, ఆమ్నాయ మందారం తదితర ఉత్కృష్టమైన గ్రంధాలలో, మహావిద్య ఉపాసనలో కూడా అమ్మవారి మహిమ అపారంగా గోచరిస్తుంది. మహిమాన్వితమైన ఈ రాజశ్యామల అమ్మవారు విశాఖ శ్రీ శారదాపీఠ మహాసంస్థానానికి ప్రధాన దేవతగా, నిత్య ఆరాధ్య దేవతగా పూజలు అందుకుంటోంది. విశాఖ శ్రీ శారదాపీఠంలో విశేష అర్చనావిధులను అందుకుంటున్న అమ్మవారికి యువకులు తమ తొలి సంపాదనను మొక్కుగా చెల్లించే ఆనవాయితీ పూర్వం నుంచి పాటిస్తున్నారు. ముఖ్యంగా గేయ చక్రాన్ని అధిరోహిస్తూ మంత్రాధిష్టాన దేవతగా పూజలు అందుకుంటోంది రాజశ్యామల అమ్మవారు. అమ్మవారి రధం గేయ చక్రం. అది విజయానికి సంకేతం. ఉపానాది స్థూపి పర్యంతం మొత్తం ఈ ఆలయం శిలతోనే నిర్మితమై ఉంది. రాజగోపురంతో కూడుకున్న రాజశ్యామల అమ్మవారి ఆలయం అత్యంత ప్రసిద్ధం. ఈ ఆలయంలోనే గురువుల ద్వారా ప్రాప్తించిన రాజశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహం మూలవిరాట్టుకు ఉత్తర భాగాన ఉంటుంది. అమ్మవారి పాదాల చెంత రజత మేరువు దర్శనమిస్తుంది. ఈ మేరువుకు నిత్యం కవచం తొడిగి ఉంటుంది. ఈ మేరువును కేవలం పౌర్ణమి, దేవీ శరన్నవరాత్రులు, పీఠం వార్షికోత్సవాల్లో మాత్రమే ప్రత్యక్షంగా చూడవచ్చు. దేవీ శరన్నవరాత్రుల్లో నవావరణ అర్చన నిర్వహిస్తారు. దాదాపు 8 గంటల పాటు ఈ అర్చనా కార్యక్రమం కొనసాగుతుంది. ఆసమయంలో ఈ శ్రీ చక్రాన్ని భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. ఇక్కడే నిత్యం అక్షరాభ్యానాలు నిర్వహిస్తుంటారు. అమ్మవారికి సుఖ శ్యామల, వీణా శ్యామల, శారద, రాజమాతంగి అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. విశాఖ శ్రీ శారదాపీఠంలో వేంచేసియున్న రాజశ్యామల అమ్మవారి గురించి విశేషంగా చెప్పాలంటే రాజకీయ లబ్ధిని ఆశించే నేతలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తుంటారు. భండాసుర సంహార వేళ జరిగిన యుద్ధంలో తంత్రము, మంత్రాంగం ఈ అమ్మవారే నిర్వహించిన కారణంగా రాజకీయ రంగంలో ఉన్నవారు అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్న విశ్వాసం సర్వత్రా నెలకొంది. ఈకారణంతోనే రాజకీయ రంగానికి చెందిన అగ్రగణ్యులు, అనేకమంది రాజనీతిజ్ఞులు విశాఖపట్నం వచ్చి రాజశ్యామల అమ్మవారిని పూజిస్తుంటారు. ఈ రాజశ్యామల అమ్మవారి ఉపాసనతో రాజ్యాధికారం దక్కించుకున్న వారెందరో ఉన్నారు. రాజశ్యామల అమ్మవారి మహిమ చేతనే రాజకీయ రంగంలో అనేకమంది అగ్రగణ్యులుగా ఎదిగి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.

పీఠ ప్రాంగణంలో ఆలయాలు

జగద్గురు ఆదిశంకరుని ఆలయం

కలియుగాన త్రిమతాచార్యుల్లో ఆదిశంకరులే జగద్గురువులుగా ప్రసిద్ధి చెందారు. ఏ సంప్రదాయాన్ని చూసినా, ఏ సిద్దాంతాన్ని తిరగేసినా జీవాత్మ, పరమాత్మ వేరనే ప్రచారమే నడిచింది. ఆ సమయంలో బౌద్ధులు, తార్కికులు, వైశేషికులు, నయ్యాయికులు ఇత్యాది 32 మతాలను భారతదేశం నుంచి పారదోలి బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానంతో కూడిన అద్వైత తత్వాన్ని ప్రకాశింపజేసినది ఆదిశంకరులే. అటువంటి శంకరాచార్యుల సంప్రదాయాన్నే విశాఖ శ్రీ శారదాపీఠం కొనసాగిస్తోంది. ప్రతి ఏటా వైశాఖ శుక్ల పంచమి రోజున శంకర జయంతిని పీఠంలో వేడుకగా నిర్వహిస్తారు. ఆరోజు పర్వదినంగా భావించి శంకర భాష్యాన్ని పారాయణ చేస్తూ వేదసభలను నిర్వహిస్తుంది విశాఖ శ్రీ శారదాపీఠం. అదే రోజు సామూహిక ఉపనయనాలను కూడా పీఠం ప్రాంగణంలో చేపడతారు

పీఠ ప్రాంగణంలో ఆలయాలు

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం

విశాఖ శ్రీ శారదాపీఠం ఉపాసనా దైవం షణ్ముఖ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నిత్య ఉపాసకులు. వల్లీ, దేవసేన సమేతుడై ద్రావిడ(షడాశ్రమ్) విమానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తుంటారు. ఆలయ శిఖరం సత్కోణ ఆకారంలో ఉంటుంది. 12 భుజాలు, ఆరు ముఖాలతో మయూర వాహనంపై ఉత్తరానికి ప్రయాణిస్తున్నట్లు దివ్యంగా కనిపిస్తారు. వారాల్లో మంగళవారం, తిధుల్లో షష్టి, నక్షత్రాల్లో కృత్తిక సమయాల్లో విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తుంటారు. సంవత్సరానికి ఒక రోజు మాఘ శుద్ధ నవమి నాడు సాయంసంధ్య వేళ రధోత్సవం నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకునేవారు ఇక్కడ అర్చనావిధులు చేపడితే సంతాన భాగ్యం, వివాహ ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి చేకూరుతుందని విశ్వాసం. వివాహ ప్రాప్తి కోసం యువతీ యువకులు ఇక్కడ వల్లీ కళ్యాణం నిర్వహిస్తుంటారు.

పీఠ ప్రాంగణంలో ఆలయాలు

దాసాంజనేయస్వామి ఆలయం

తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని 18 అడుగుల ఏకశిలా సాలగ్రామ విగ్రహ రూపంలో దాసాంజనేయ స్వామి పీఠంలో కొలువుదీరి ఉన్నాడు. రాక్షస సంహారం కోసం దక్షిణముఖంగా ఉన్న లంక వైపు ప్రయాణానికి సిద్ధమైనట్లు దాసాంజనేయ రూపం ఉంటుంది. కార్యసిద్ధి హనుమంతుడుగా ఇక్కడి దాసాంజనేయ స్వామికి పేరుంది. ఏదైనా కార్యసాధనకు బయలుదేరే ముందు ఈ అంజనీపుత్రుడిని సందర్శిస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. ప్రతి శనివారం, పూర్వాభాద్ర నక్షతం నాడు విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. హనుజ్జయంతి పర్వదినాన ఉత్సవాలు జరుగుతాయి.

పీఠ ప్రాంగణంలో ఆలయాలు

వనదుర్గ ఆలయం

ప్రకృతిమాత మాత్రమే ప్రపంచాన్ని పెంచి పోషిస్తుందని బలంగా విశ్వసిస్తారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి. అందుకే! పీఠంలో వనదుర్గ అమ్మవారిని ప్రతిష్టించారు. సకల చరాచర సృష్టికి మూలమైన బ్రహ్మదేవునికి వన అనే నామధేయం కూడా ఉంది. బ్రహ్మతత్వాన్ని నింపుకున్న వనదుర్గను కొలవడం వేద విహితమని భావించి పీఠం ప్రాంగణంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. పర్యావరణ సమతౌల్యం కొరవడినపుడు వనదుర్గను పూజిస్తే భూతాపం తగ్గుతుందనేది పురాణేతిహాసాల్లో చెప్పబడి ఉంది. పీఠంలో 16 భుజాలతో రాజసంగా కనిపించే వనదుర్గ అమ్మవారి ప్రతిమ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ తప్ప మరెక్కడా లేదు. అన్నవరం పుణ్యక్షేత్రంలో మెట్ల మార్గాన వనదుర్గ దర్శనమిస్తున్నప్పటికీ అక్కడ నాలుగు భుజాలతోనే కనిపిస్తుంది. సమస్త భయాలను తొలగించే దేవతగా విశాఖ శ్రీ శారదాపీఠంలో కొలువుదీరిన వనదుర్గ అమ్మవారికి పేరుంది.

పీఠ ప్రాంగణంలో ఆలయాలు

దక్షిణామూర్తి ఆలయం

ఈ ప్రపంచానికి ఆది గురువు దక్షిణామూర్తి. ఆయనను తలచుకుంటే మోక్షం ప్రాప్తిస్తుంది. దక్షిణామూర్తిని నేను పూజిస్తున్నానని సాక్షాత్తు ఆదిశంకరులే చెప్పారు. జ్జాన సముపార్జనకు దక్షిణామూర్తిని కొలవాలని భావించి విశాఖ శ్రీ శారదాపీఠంలో ప్రత్యేక ఆలయాన్ని నెలకొల్పారు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు. ఇక్కడ కనిపించే దక్షిణామూర్తి ఆలయానికి చాలా ప్రాశస్త్యముంది. కైలాస శిఖరంపై కూర్చున్నట్లు ఇక్కడి దక్షిణామూర్తి దర్శనమిస్తాడు. అహంకార రూపుడైన రాక్షసుడిని వధిస్తున్నట్లు ప్రతిమ కనిపిస్తుంది. దక్షిణామూర్తి పాదాల వద్ద సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత అనే పేర్లు కలిగిన నలుగురు వృద్ధ శిష్యులు కూర్చుని ఉంటారు. శిష్యులు కురువద్దులు కాగా వారికి గురువుగా దక్షిణామూర్తి నవయవ్వనుడై దర్శనమివ్వడం విశేషం. దక్షిణామూర్తి నాలుగు చేతుల్లో ఒక చేతితో అగ్నిహోత్రం, మరో చేతితో సమస్త వ్యాకరణాలకు మూలమైన ఢమరుకం, ఇంకో చేతితో సమస్త విద్యలకు ప్రతీకగా నిలిచే గ్రంధం, మరో చేతితో చిన్ముద్ర ఉంటాయి. వటవృక్షం నీడలో దక్షిణామూర్తి సేద తీరినట్లు మూలవిరాట్టు కనిపిస్తుంది

పీఠం భౌగోళిక స్వరూపం

విశాఖ శ్రీ శారదాపీఠానికి విచ్చేసినపుడు ముందుగా ఎదురయ్యేది స్వాగత ద్వారం. అది దాటుకుని వస్తే దక్షిణం వైపు పీఠం ప్రధాన ద్వారం దర్శనమిస్తుంది. ఆద్వారంపై శంకరులు స్థాపించిన షణ్మతాలు గోచరిస్తాయి. పీఠంలో అడుగుమోపిన మరుక్షణం ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఆదిగురువు శ్రీ మేధా దక్షిణామూర్షి మందిరం దర్శనమిస్తుంది. దాన్ని ఆనుకునే పీఠం ప్రధాన కార్యాలయం ఉంటుంది. తర్వాత గురుపాదుక పేరుతో ఎర్పాటైన భవనం ఉంటుంది. దాన్ని ఆనుకునే జగద్గురు నిలయం దర్శనమిస్తుంది. ఇదే పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివార్ల నిలయం. స్వామి వార్ల దర్శన భాగ్యం ఇక్కడి దర్బారు హాలులోనే ఉంటుంది. ఎదురుగా సిద్ధి గణపతి స్థూపం దర్శనమిస్తుంది. శ్రీ చరణులు ప్రాతః కాల అనుష్టానం అయిన వెనువెంటనే సిద్ధిగణపతిని దర్శిస్తారు. జగద్గురు మందిరాన్ని ఆనుకునే పీఠం అధిష్టాన దేవత అయిన శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఆలయం ఉన్నది. అమ్మవారి ఆలయానికి దక్షిణంగా విజయగణపతి, ఉత్తరం వైపు జగద్గురు ఆది శంకరాచార్యుల ఆలయాలు కొలువై ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే షోడశ భుబి రూపంలో వనదుర్గ అమ్మవారు కూడా కొలువుదీరి ఉన్నారు. ఈ ప్రాంగణాన్ని ఆనుకునే పిఠం పోటుని నిర్వహిస్తారు. పోటుకు పైభాగంలో విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల అగుపిస్తుంది. పోటు ప్రాంగణంలోనే అన్న ప్రసాద వితరణ కోసం ప్రత్యేక హాలు ఉంటుంది. ఆ తర్వాత ఉత్సవ మండపం...దానికెదురుగా వల్లి కళ్యాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపే అపూర్వ సుధా నిర్మాణం కనువిందు చేస్తుంది. దీనికి కుడివైపు శ్రీకృష్ట పరమాత్ముని ఆలయం దాన్ని ఆనుకుని నాగదేవత, ఉత్తరం వైపు దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శనమిస్తాయి. కొంచెం ముందుకు వెళితే దాసాంజనేయ స్వామి దర్శనం లభిస్తుంది. దాసాంజనేయ మండపాన్ని ఆనుకుని అత్యంత సుందరంగా సాలిగ్రామ శిలతో నిర్మితమైన స్వయంజ్యోతి మండపం ఆకర్షిస్తుంది. ఈ మండపాన్ని ఆనుకుని వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఎదురుగా చంద్రమౌళీశ్వరుల దేవాలయం, అలాగే ప్రదోష తాండవమూర్తి సుందర రూపం మరియు విజయాన్ని చేకూర్చు శమీ వృక్షం ఉంటాయి. శమీ వృక్షం నీడలో శాశ్వత నిర్మాణంతో కూడిన ఆగమ యాగశాల కనిపిస్తుంది. యాగశాలకు ఎదురుగా శారదా చంద్రమౌళీశ్వరులకు నిత్య పీఠపూజ మందిరం ఉంటుంది. ఇక్కడే శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహం స్వర్ణ మందిరంలో కొలువుదీరి ఉంటుంది. స్వామివార్లు నిత్యం ఇక్కడే అమ్మవారికి పీఠపూజ చేపడుతుంటారు. ఈ ప్రాంగణానికి ఎదురుగా సుగంధ పరిమళాలు వెదజల్లే పూలమొక్కలు, పలు దేవతా వృక్షాలతో సుందర నందనవనం కనువిందు చేస్తుంది. పీఠ పాలకుడైనటువంటి కాల భైరవుడు ఇందులోనే కొలువుదీరి ఉంటాడు. అక్కడే పీఠం యొక్క తూర్పు ద్వారం దర్శనమిస్తుంది. పీఠం వెనుక భాగంలో గోశాల కూడా నిర్వహించబడుతోంది. పీఠంలో విధులు నిర్వర్తించే అర్చక, పాచక, పరిచారకుల కోసం గృహ సముదాయం ఉంటుంది.

పీఠానికి ప్రధానమైనవి -

  • మఠ క్షేత్రం - సింహాచలం
  • పీఠ దేవత - స్కందుడు
  • పీఠ రక్షకుడు - నారసింహుడు
  • పిఠ శక్తి - శ్రీ శారదా స్వరూప రాజశ్యామల
  • పీఠ సాంప్రదాయం - ఇంద్ర సరస్వతీ
  • పీఠ తీర్ధం - జ్ఞానవాపి
  • పీఠ లక్ష్యం - శంకర అద్వైత ప్రచారం, సనాతన ధర్మ పరిరక్షణ

రాజశ్యామల అమ్మవారి ఆలయం

విశాఖ శ్రీ శారదాపీఠంలో ఆధిష్టాన దేవతగా, పీఠ శక్తిగా విరాజిల్లుతున్న శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి వైభవం విశేష ప్రాచుర్యం పొందింది. విశాఖ శ్రీ శారదాపీఠ గురుపరంపరలో అతి సనాతనంగా అనుష్టానం చేస్తున్న అమ్మవారు రాజశ్యామల అమ్మవారు. ఎక్కడా లేని విధంగా శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి మంత్ర ప్రదానంగా అర్చనా విధులు నిర్వహించడం విశాఖ శ్రీ శారదాపీఠంలోనే కనిపిస్తుంది. వేదకాలంలో భండాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి ఆ జగన్మాతయే రాజశ్యామల అమ్మవారిగా మంత్ర తంత్ర ప్రదానంగా అవతరించారు. త్రిగుణాత్మకంగా, కాలానుగుణంగా అమ్మవారు దర్శనమిస్తుంటారు. దేవతలు నాలుగు భుజాలతో కూడి ఉన్న రాజశ్యామల అమ్మవారిని సత్వ గుణ ప్రదానంగా అర్చన చేస్తే, మానవులు 8 భుజాలతో కూడి ఉన్న రాజశ్యామల అమ్మవారిని రజో గుణ మూర్తిగా ఆరాధిస్తుంటారు. అసురులు షోడశ(16) భుజాలతో కూడిన రాజశ్యామల అమ్మవారిని తమోగుణ ప్రదానంగా అర్చిస్తూ ఉంటారు. హయగ్రీవుడు అగస్త్యునికి ధర్మ సూక్ష్మాలను ఉపదేశిస్తున్న సమయంలో రాజశ్యామల ప్రస్తావన వచ్చింది. నిత్యైవశా జగన్మూర్తి స్మృతుల్లో చెప్పబడినటువంటి అనేక సూక్ష్మాలను అగస్త్యుడు హయగ్రీవుల ద్వారా తెలుసుకున్నారు. ఎంతోమంది బుషులు, మునులు అనేక ఉపాసనా గ్రంధాలలో రాజశ్యామల యొక్క అనుష్టానాన్ని, తత్వాన్ని విశేషంగా ప్రస్తావించారు. శారదా తిలకం, ప్రపంచ సార తంత్రం, ఆమ్నాయ మందారం తదితర ఉత్కృష్టమైన గ్రంధాలలో, మహావిద్య ఉపాసనలో కూడా అమ్మవారి మహిమ అపారంగా గోచరిస్తుంది. మహిమాన్వితమైన ఈ రాజశ్యామల అమ్మవారు విశాఖ శ్రీ శారదాపీఠ మహాసంస్థానానికి ప్రధాన దేవతగా, నిత్య ఆరాధ్య దేవతగా పూజలు అందుకుంటోంది. విశాఖ శ్రీ శారదాపీఠంలో విశేష అర్చనావిధులను అందుకుంటున్న అమ్మవారికి యువకులు తమ తొలి సంపాదనను మొక్కుగా చెల్లించే ఆనవాయితీ పూర్వం నుంచి పాటిస్తున్నారు. ముఖ్యంగా గేయ చక్రాన్ని అధిరోహిస్తూ మంత్రాధిష్టాన దేవతగా పూజలు అందుకుంటోంది రాజశ్యామల అమ్మవారు. అమ్మవారి రధం గేయ చక్రం. అది విజయానికి సంకేతం. ఉపానాది స్థూపి పర్యంతం మొత్తం ఈ ఆలయం శిలతోనే నిర్మితమై ఉంది. రాజగోపురంతో కూడుకున్న రాజశ్యామల అమ్మవారి ఆలయం అత్యంత ప్రసిద్ధం. ఈ ఆలయంలోనే గురువుల ద్వారా ప్రాప్తించిన రాజశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహం మూలవిరాట్టుకు ఉత్తర భాగాన ఉంటుంది. అమ్మవారి పాదాల చెంత రజత మేరువు దర్శనమిస్తుంది. ఈ మేరువుకు నిత్యం కవచం తొడిగి ఉంటుంది. ఈ మేరువును కేవలం పౌర్ణమి, దేవీ శరన్నవరాత్రులు, పీఠం వార్షికోత్సవాల్లో మాత్రమే ప్రత్యక్షంగా చూడవచ్చు. దేవీ శరన్నవరాత్రుల్లో నవావరణ అర్చన నిర్వహిస్తారు. దాదాపు 8 గంటల పాటు ఈ అర్చనా కార్యక్రమం కొనసాగుతుంది. ఆసమయంలో ఈ శ్రీ చక్రాన్ని భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. ఇక్కడే నిత్యం అక్షరాభ్యానాలు నిర్వహిస్తుంటారు. అమ్మవారికి సుఖ శ్యామల, వీణా శ్యామల, శారద, రాజమాతంగి అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. విశాఖ శ్రీ శారదాపీఠంలో వేంచేసియున్న రాజశ్యామల అమ్మవారి గురించి విశేషంగా చెప్పాలంటే రాజకీయ లబ్ధిని ఆశించే నేతలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తుంటారు. భండాసుర సంహార వేళ జరిగిన యుద్ధంలో తంత్రము, మంత్రాంగం ఈ అమ్మవారే నిర్వహించిన కారణంగా రాజకీయ రంగంలో ఉన్నవారు అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్న విశ్వాసం సర్వత్రా నెలకొంది. ఈకారణంతోనే రాజకీయ రంగానికి చెందిన అగ్రగణ్యులు, అనేకమంది రాజనీతిజ్ఞులు విశాఖపట్నం వచ్చి రాజశ్యామల అమ్మవారిని పూజిస్తుంటారు. ఈ రాజశ్యామల అమ్మవారి ఉపాసనతో రాజ్యాధికారం దక్కించుకున్న వారెందరో ఉన్నారు. రాజశ్యామల అమ్మవారి మహిమ చేతనే రాజకీయ రంగంలో అనేకమంది అగ్రగణ్యులుగా ఎదిగి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.

కలియుగాన త్రిమతాచార్యుల్లో ఆదిశంకరులే జగద్గురువులుగా ప్రసిద్ధి చెందారు. ఏ సంప్రదాయాన్ని చూసినా, ఏ సిద్దాంతాన్ని తిరగేసినా జీవాత్మ, పరమాత్మ వేరనే ప్రచారమే నడిచింది. ఆ సమయంలో భౌద్దులు, తార్కికులు, వైశేషికులు, నయ్యాయికులు ఇత్యాది 32 మతాలను భారతదేశం నుంచి పారదోలి బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానంతో కూడిన అద్వైత తత్వాన్ని ప్రకాశింపజేసినది ఆదిశంకరులే. అటువంటి శంకరాచార్యుల సంప్రదాయాన్నే విశాఖ శ్రీ శారదాపీఠం కొనసాగిస్తోంది. ప్రతి ఏటా వైశాఖ శుక్ల పంచమి రోజున శంకర జయంతిని పీఠంలో వేడుకగా నిర్వహిస్తారు. ఆరోజు పర్వదినంగా భావించి శంకర భాష్యాన్ని పారాయణ చేస్తూ వేదసభలను నిర్వహిస్తుంది విశాఖ శ్రీ శారదాపీఠం. అదే రోజు సామూహిక ఉపనయనాలను కూడా పీఠం ప్రాంగణంలో చేపడతారు

విశాఖ శ్రీ శారదాపీఠం ఉపాసనా దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నిత్య ఉపాసకులు. వల్లీ, దేవసేన సమేతుడై ద్రావిడ(షడాశ్రమ్) విమానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తుంటారు. ఆలయ శిఖరం సత్కోణ ఆకారంలో ఉంటుంది. 12 భుజాలు, ఆరు ముఖాలతో మయూర వాహనంపై ఉత్తరానికి ప్రయాణిస్తున్నట్లు దివ్యంగా కనిపిస్తారు. వారాల్లో మంగళవారం, తిధుల్లో షష్టి, నక్షత్రాల్లో కృత్తిక సమయాల్లో విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తుంటారు. సంవత్సరానికి ఒక రోజు మాఘ శుద్ధ నవమి నాడు సాయంసంధ్య వేళ రధోత్సవం నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకునేవారు ఇక్కడ అర్చనావిధులు చేపడితే సంతాన భాగ్యం, వివాహ ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి చేకూరుతుందని విశ్వాసం. వివాహ ప్రాప్తి కోసం యువతీ యువకులు ఇక్కడ వల్లీ కళ్యాణం నిర్వహిస్తుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని 18 అడుగుల ఏకశిలా సాలగ్రామ విగ్రహ రూపంలో దాసాంజనేయ స్వామి పీఠంలో కొలువుదీరి ఉన్నాడు. రాక్షస సంహారం కోసం దక్షిణముఖంగా ఉన్న లంక వైపు ప్రయాణానికి సిద్ధమైనట్లు దాసాంజనేయ రూపం ఉంటుంది. కార్యసిద్ధి హనుమంతుడుగా ఇక్కడి దాసాంజనేయ స్వామికి పేరుంది. ఏదైనా కార్యసాధనకు బయలుదేరే ముందు ఈ అంజనీపుత్రుడిని సందర్శిస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. ప్రతి శనివారం, పూర్వాభాద్ర నక్షతం నాడు విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. హనుజ్జయంతి పర్వదినాన ఉత్సవాలు జరుగుతాయి.

ప్రకృతిమాత మాత్రమే ప్రపంచాన్ని పెంచి పోషిస్తుందని బలంగా విశ్వసిస్తారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి. అందుకే! పీఠంలో వనదుర్గ అమ్మవారిని ప్రతిష్టించారు. సకల చరాచర సృష్టికి మూలమైన బ్రహ్మదేవునికి వన అనే నామధేయం కూడా ఉంది. బ్రహ్మతత్వాన్ని నింపుకున్న వనదుర్గను కొలవడం వేద విహితమని భావించి పీఠం ప్రాంగణంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. పర్యావరణ సమతౌల్యం కొరవడినపుడు వనదుర్గను పూజిస్తే భూతాపం తగ్గుతుందనేది పురాణేతిహాసాల్లో చెప్పబడి ఉంది. పీఠంలో 16 భుజాలతో రాజసంగా కనిపించే వనదుర్గ అమ్మవారి ప్రతిమ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ తప్ప మరెక్కడా లేదు. అన్నవరం పుణ్యక్షేత్రంలో మెట్ల మార్గాన వనదుర్గ దర్శనమిస్తున్నప్పటికీ అక్కడ నాలుగు భుజాతోనే కనిపిస్తుంది. సమస్త భయాలను తొలగించే దేవతగా విశాఖ శ్రీ శారదాపీఠంలో కొలువుదీరిన వనదుర్గ అమ్మవారికి పేరుంది.

ఈ ప్రపంచానికి ఆది గురువు దక్షిణామూర్తి. ఆయనను తలచుకుంటే మోక్షం ప్రాప్తిస్తుంది. దక్షిణామూర్తిని నేను పూజిస్తున్నానని సాక్షాత్తు ఆదిశంకరులే చెప్పారు. జ్జాన సముపార్జనకు దక్షిణామూర్తిని కొలవాలని భావించి విశాఖ శ్రీ శారదాపీఠంలో ప్రత్యేక ఆలయాన్ని నెలకొల్పారు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు. ఇక్కడ కనిపించే దక్షిణామూర్తి ఆలయానికి చాలా ప్రాశస్త్యముంది. కైలాస శిఖరంపై కూర్చున్నట్లు ఇక్కడి దక్షిణామూర్తి దర్శనమిస్తాడు. అహంకార రూపుడైన రాక్షసుడిని వధిస్తున్నట్లు ప్రతిమ కనిపిస్తుంది. దక్షిణామూర్తి పాదాల వద్ద సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత అనే పేర్లు కలిగిన నలుగురు వృద్ధ శిష్యులు కూర్చుని ఉంటారు. శిష్యులు కురువద్దులు కాగా వారికి గురువుగా దక్షిణామూర్తి నవయవ్వనుడై దర్శనమివ్వడం విశేషం. దక్షిణామూర్తి నాలుగు చేతుల్లో ఒక చేతితో అగ్నిహోత్రం, మరో చేతితో సమస్త వ్యాకరణాలకు మూలమైన ఢమరుకం, ఇంకో చేతితో సమస్త విద్యలకు ప్రతీకగా నిలిచే గ్రంధం, మరో చేతితో చిన్ముద్ర ఉంటాయి. వటవృక్షం నీడలో దక్షిణామూర్తి సేద తీరినట్లు మూలవిరాట్టు కనిపిస్తుంది

సంప్రదించండి

మీకు సంబంధించిన సమాచారం వేరెవరికీ చేరదు. గోప్యంగా ఉంటుంది.