విరాళాలు

పీఠం చేపడుతున్న వివిధ కార్యక్రమాలలో, సమాజ సేవలో మీరు పాలుపంచుకోండి.

మీరు దేనికొరకు విరాళం ఇవ్వదల్చుకొన్నారో ఎంచుకోండి

మీరు దేనికొరకు విరాళం ఇవ్వదల్చుకొన్నారో ఎంచుకోండి
వేద పాఠశాల

వేద పాఠశాలకు విరాళం

వేదం విశ్వజనీనం. వేదం విశ్వ విద్య. ప్రాపంచిక బంధాలన్నింటినీ ధర్మబద్ధంగా నిర్వహించడానికి అవసరమయ్యే శక్తినిచ్చేదే వేదం. భారతీయ ధర్మానికి తల్లలాంటిది వేదం. భారతీయ సమాజానికి మాత్రమే పరమాత్మ అందివ్వగా లభించిన వరమే వేదం. ఇటువంటి వేద విద్యను రానున్న తరాలకు అందివ్వడం విశాఖ శ్రీ శారదాపీఠం ధ్యేయం. వేదం నేర్చుకోవడం, వేదం నేర్పడం ఎంత పుణ్యప్రదమో వేదాధ్యయనానికి హార్థికంగా, ఆర్థికంగా సహాయపడడం కూడా అంతే పుణ్యం.

గోశాల

గోశాలకు విరాళం

హిందూ ధర్మంలో గోవుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. నవమాసాలు మోసిన కన్న తల్లిలా విలువనిస్తూ గోవును గోమాతగా భావిస్తాం. సమస్త ప్రపంచం గోవులో ఉందని విశ్వసిస్తాం. గోపూజ అంటే సమస్త దైవ స్వరూపాలను ఏకకాలంలో పూజించడమేనని విశ్వసిస్తాం. గోవును అర్చించడం అంటే సమస్త మానవాళిని సక్రమ మార్గంలో పెట్టే పరమాత్మ శక్తిని పూజించడమే. ఆ శక్తిని ఆవాహన చేసుకోవడమే. అందుకే! గోపూజ, గోసేవ మానవుని జీవితంలో నిత్యం చేయాలని పెద్దలు అంటారు.

ఆలయాలకు విరాళం

ఆలయాలు వ్యక్తి నిర్మాణ కేంద్రాలు. భక్తుల మనస్సులను స్థిమితంగా ఉంచడానికి, ధర్మ వర్తన వైపు నడిపించడానికి తోడ్పడతాయి. విగ్రహారాధన, పూజాదికాలు భక్తుల్లో అనుశాసన నేర్పిస్తాయి. ధర్మ ప్రబోధానికి, సనాతన సంస్కతి, సంప్రదాయాల సంరక్షణకు, మానవ క్షేమానికి అవిశ్రాంతంగా పాటు పడుతున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఎన్నో ఆలయాలను నిర్వహిస్తోంది. వాటి నిర్వహణకు ఆర్థిక సాయం అందించడం ద్వారా ఈ ధర్మయజ్ఞంలో మీరూ భాగస్వాములు కండి.

యాగాలకు విరాళం

సకల ప్రాణికోటికి, సమస్త జీవజాలానికి ప్రకృతే నిలయం. ప్రకృతి నియంత్రణలో ఉండడానికి యజ్ఞ యాగాదులు ఉపకరిస్తాయి. ప్రకృతితో పాటు మనిషి యొక్క మేధను, ఆలోచనలను, తెలివిని ధర్మ మార్గంలో నడిపించడానికి సహకరిస్తాయి. అలాంటి యజ్ఞయాగాదులను విశాఖ శ్రీ శారదాపీఠం సందర్భానుసారం నిర్వహిస్తుంది.

పాదుకా దక్షిణ / యతి భిక్షకు విరాళం

సకల ప్రాణికోటికి, సమస్త జీవజాలానికి ప్రకతే నిలయం. ప్రకతి నియంత్రణలో ఉండడానికి యజయాగాదులు ఉపకరిస్తాయి. ప్రకతితో పాటు మనిషియొక్క మెధను, ఆలోచనలను, తెలివిని ధర్మ మార్గంలో నడిపించడానికి సహకరిస్తాయి. అలాంటి యజ్ఞయాగాదులను విశాఖ శ్రీ శారదాపీఠం సందర్భానుసారం నిర్వహిస్తుంది.

పీఠం అభివృద్ధికి విరాళం

సంస్కార కేంద్రంగా జనావళి సంభావించే విశాఖ శ్రీ శారదాపీఠం వృద్ధి చెందడమంటే, ప్రవర్ధిల్లడమంటే సర్వ మానవకోటి మరింతగా వన్నెలీనడమే. పీఠం శాఖోపశాఖలుగా వర్ధిల్లడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకానేక సంస్కార కేంద్రాలను నెలకొల్పడానికి నిరంతర కృషి జరుపుతూనే ఉంటుంది. ఈ సుధర్మ కార్యంలో, ఈ ధర్మ మార్గంలో మరింత వేగంగా పీఠం పయనించడానికి, అభివృద్ధి చెందడానికి సమాజం సహకరించాలి.

సంప్రదించండి

మీకు సంబంధించిన సమాచారం వేరెవరికీ చేరదు. గోప్యంగా ఉంటుంది.