గురు పరంపర

  • జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య

  • అపర శంకరులు శ్రీ సచ్చిదానందేంద్ర

  • జ్ఞానమూర్తి శ్రీ అద్వైతానందేంద్ర

ధ్యానమూలం గురోర్ముర్తిః పూజామూలం గురోపదమ్। మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా॥

visistatha-img

విశాఖ శ్రీ శారదాపీఠం విశిష్టత

విశాఖ శ్రీ శారదాపీఠం ఆదిశంకరాచార్య సాంప్రదాయ అద్వైత పీఠం. తపో పీఠం. జ్ఞాన పీఠం. సిద్ధి పీఠం. సమాజంలో కాలానుగుణంగా ధర్మం నిర్వర్తించబడుతూ ఉండాలని తపిస్తుంది విశాఖ శ్రీ శారదాపీఠం. సనాతన ధర్మాన్ని ఆధునిక కాలానికి పునర్నిర్వర్తించే మహత్తర కార్యం భారతదేశంలో ఎవరైనా చేస్తున్నారంటే..అది విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారే. నిత్య నూతనమైన మానవ సమూహాలకు దిశా దర్శనం చేయిస్తున్న భారతీయ ధర్మం గంగా స్రోతస్వినిగా నిరంతరం ప్రవహింపజేయడానికి విశాఖ శ్రీ శారదాపీఠం అహర్నిశలు కృషి చేస్తోంది. భారతీయ తత్వాన్ని, భారతీయ సత్వాన్ని నేల నలుచెరగులా అనుక్షణం ప్రబోధం చేసేటటువంటి గొప్ప కార్యాన్ని పీఠం నిర్వహిస్తోంది.

పీఠం లో వుండే ఆలయాలు

దేవతామూర్తుల ఆరాధనలు, పీఠాధిపతుల అనుష్టానం, అక్షరాభ్యాసములు, శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అర్చనలు, వేద పాఠశాల నుంచి విన వచ్చే వేదఘోష....

5:15 AM

మహాస్వామి వారి అనుష్టానం

5:30 AM

వేద విద్యార్థుల ప్రాతఃకాల సంధ్యావందనం

6:00 AM

జేగంటల మధ్య తెరుచుకోనున్న విశాఖ శ్రీ శారదాపీఠం ముఖద్వారం, ఆలయాలు

6:10 AM

మహాస్వామి ఆలయాల సందర్శన

06:15 AM

చంద్రమౌళీశ్వరులకు ప్రాతఃకాల అర్చన

6:30 AM

రాజశ్యామల అమ్మవారికి అర్చన

6:40 AM

షణ్ముగం శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన

6:50 AM

దాసాంజనేయస్వామికి అర్చన

7:10 AM

మేధా దక్షిణామూర్తికి అర్చన

7:30 AM

వనదుర్గ అమ్మవారికి అర్చన

7:40 AM

రాజశ్యామల అమ్మవారికి వేదపండితులు, వేద విద్యార్థులచే పీఠార్చన

8:30 AM

వేదాధ్యయనం

9:00 AM-12:00 PM

పీఠాధిపతుల దర్శనం

11:30 AM-12:30 PM

వేద విద్యార్థుల మాధ్యాహ్నిక సంధ్యావందనం

11:30 AM

గంటానాదం మధ్య ఆలయాల మూసివేత

3:00 PM

వేద విద్యార్థుల ఆవృత్తి

4:30 PM

జేగంటల మధ్య తెరుచుకోనున్న ఆలయాలు

5:00 PM

పీఠాధిపతులచే రాజశ్యామల అమ్మవారికి పీఠార్చన

6:00 PM

ప్రదోషకాలంలో తాండవమూర్తిని దర్శించనున్న పీఠాధిపతులు

6:30 PM

వేద విద్యార్థులచే విష్ణుసహస్ర, లలితా సహస్ర నామ పారాయణ, సంకీర్తన

6:30 PM - 7:30 PM

పీఠాధిపతుల దర్శనం

8:30 PM

గంటానాదం మధ్య ఆలయాల మూసివేత

భారతీయ జీవన విధానం వేద సమ్మతం. వేద పరిరక్షణ విశాఖ శ్రీ శారదాపీఠం అభిమతం. ఏడాది పొడవునా పీఠం చేపట్టే వేదోక్తమైన, వైదికపరమైన కార్యక్రమాల సమాహారమిది.

విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించి పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్

చాతుర్మాస్య దీక్ష చేపట్టిన సందర్భంగా ఋషికేష్ లో గంగానదీ తీరాన వేద విద్యార్థులు, వేద పండితులతో పీఠాధిపతులు

విశాఖ శ్రీ శారదాపీఠం నూతన లోగోను ఆవిష్కరించిన పీఠాధిపతులు

శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి హారతులిస్తున్న పీఠాధిపతులు

విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాల్లో శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పీఠాధిపతుల చేతులమీదుగా అభిషేకం

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పీఠం ప్రాంగణంలో ఆయుధ పూజ

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారిని దర్శించిన పీఠాధిపతులు

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ప్రత్యేక అలంకరణకు హారతులు

ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి చేతుల మీదుగా శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పీఠార్చన

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో గిరిజన మహిళలకు చీరల పంపిణీ

ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి హిందూ ధర్మ ప్రచార యాత్రకు శ్రీకాకుళంలో బ్రహ్మరధం పట్టిన భక్తులు

విశాఖ జిల్లా అరకులోయలో గిరిపుత్రుల కోసం పీఠం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఉత్తరాధికారి

విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన తిరుమల యాత్రకు బయలుదేరిన బస్సులు

తిరుమలేశుని దర్శనానికి బయలుదేరే ముందు పీఠం ప్రధాన ద్వారం ఎదుట తన్మయత్వంతో గిరిజన మహిళల నృత్యం

గిరిజన, హరిజన పుత్రులతో కలిసి ఉత్తరాధికారి చేపట్టిన తిరుమల యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తున్న పీఠాధిపతులు

ఋషికేష్ వద్ద గంగాతీరంలో పీఠం ఉత్తరాధికారి అనుష్టానం

గంగామాత ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఋషికేష్ వద్ద గంగమ్మ తల్లికి హారతులిచ్చిన పీఠాధిపతులు

గిరిజనులు, దళితులతో కలిసి శ్రీవారిని దర్శించిన అనంతరం రంగనాయక మండపంలో పీఠం ఉత్తరాధికారి

ధర్మ జాగృతి ధ్యేయంగా చేపట్టిన యాత్ర తిరుమలకు చేరిన సందర్భంలో వందలాది మంది గిరిజనులు, హరిజనులతో...

ఉగాది పర్వదినాన విశాఖ శ్రీ శారదాపీఠం గంటల పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్న పీఠాధిపతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పీఠాన్ని సందర్శించిన సందర్భంలో నుదుట తిలకం దిద్దుతున్న ఉత్తరాధికారి

విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు అందుకుంటున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

విశాఖ శ్రీ శారదాపీఠం వెబ్‌సైట్ www.thevssp.com ను ఆవిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

బుద్ధి జీవుల్లో ఉండే కల్మషాన్ని, కశ్మలాన్ని, చీకటిని, ఆలోచనల్లో ఉండే అసమానతలను తొలగించి మానవుడిని ప్రేమమూర్తిగా తయారుచేసేవాడే గురువు. అలాంటి గురువులు ఈ సమాజానికి నిర్దేశకులు అవుతారు. మానవ జాతిని సన్మార్గంలో నడిపిస్తారు

నిరతం ధర్మపోరాటాలు, ధర్మప్రబోధాలు చేపట్టే చైతన్యమూర్తి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి. భారతీయులంతా ధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మప్రచారం చేయాలనేది గురువులు స్వరూపానందేంద్రుల సందేశం. ధర్మగ్లాని జరిగినపుడు శాస్త్రబద్ధమైన, విహితమైన సంప్రదాయాన్ని కాపాడాలి. శరీరం రాలిపోక ముందే ఇహంలోనే ఆత్మసాక్షాత్కారం కలగాలి. సర్వధర్మాలు పరమాత్ముని చేరడానికేనని శ్రీ చరణుల ఉపదేశం.

 vishaka-sree2

ఛాయాచిత్రాలు

పీఠం, పీఠాధిపతుల ఛాయాచిత్రాలు, దృశ్య మాలిక

మరింత విస్తృతంగా ...

సంప్రదించండి

మీకు సంబంధించిన సమాచారం వేరెవరికీ చేరదు. గోప్యంగా ఉంటుంది.